శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 13 మే 2015 (19:00 IST)

బాహుబలిలో 'భల్లాల దేవ'... 'ఇండియాలోనే బెస్ట్ విలన్ నేనే'.. రానా దగ్గుబాటి..!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న, భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'పై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా దేశ వ్యాప్తంగా బాహుబలి సినిమాపై వివిధ అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో ఇందులో నటించిన రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను భల్లాల దేవగా నటించినట్లు తెలిపాడు. 
 
ఆ పాత్ర రామాయణలోని రావణ పాత్ర లాగా, మహాభారతంలోని దుర్యోధుని పాత్ర లాగా ఉండబోతుందన్నారు. తన పాత్ర ఇండియాలోని గ్రేటెస్ట్ విలన్‌గా నిలిచిపోతుందని రానా చెబుతున్నారు. ప్రస్తుతం రానా నటించిన 'బాహుబలి'తోపాటు ' రుద్రమదేవి' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
 
కాగా బాహుబలి సినిమా రిలీజ్ విషయాన్ని పక్కనబెడితే రాజమౌళి ప్రస్తుతం ఆ సినిమాలో నటించే అగ్ర నటుల పోస్టర్లను విడుదల చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, ప్రభాకర్‌, నాజర్ లుక్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి నెక్ట్స్ విలన్ పాత్ర 'భల్లాల దేవ‌'గా రానా స్పెషల్ లుక్‌కు ప్రేక్షకుల ముందుకు తెస్తారని సమాచారం.