గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:05 IST)

హీరోగా సినిమాలు చేస్తాను: నాగార్జున

హీరోగా సినిమాలు చేస్తానని అక్కినేని నాగార్జున అన్నారు. మరో 5, లేక 10, లేక 15 సినిమాలు హీరోగా చేయగలనా? అని అన్నారు. విభిన్నమైన సినిమాలు చేయాలని నాగ్ ఆకాంక్షించారు.

తెలుగు ప్రేక్షకులు తనను ఇంకెంత కాలం హీరోగా చూస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తాను చాలా రకాల సినిమాలు చేశానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ గుర్తుంచుకునే మంచి సినిమాలు తన ఖాతాలో చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
 
తన కుమారుడు అఖిల్‌ను తానే తెరకు పరిచయం చేశానని అన్నారు. అలాగే తన తండ్రి చివరి సినిమాను కూడా తానే పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 8 గ్రామాలను అభిమానులు దత్తత తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలని ఆయన అన్నారు.