బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (14:17 IST)

వెంకన్నగా అన్నమయ్య నాగార్జున: రాఘవేంద్రరావు డైరక్షన్‌లో..

కలియుగ ప్రత్యక్ష దేవుడు వేంకటేశ్వరస్వామి భక్తుడు అన్నమయ్యగా నటించి అలరించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు ఏకంగా తిరుమల వేంకటేశుడి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో నాగార్జునతో 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి జనరంజకమైన ఆధ్యాత్మిక కథా చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడీ చిత్రాన్ని రూపొందించడానికి సమాయత్తమవుతున్నారు. 
 
ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. వీరి కలయికలో 'శిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్మార్ సాయికృప ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత మహేష్ రెడ్డి ఇప్పుడీ భారీ ప్రాజక్టును చేబడుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్టు చెబుతున్నారు.