శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (11:51 IST)

రాత్రి 12 గంటలకు డైరక్టర్‌కు నాగార్జున సర్‌ప్రైజ్ ట్రీట్!

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే అక్కినేని నాగార్జున తాజాగా కల్యాణ్ కృష్ణ అనే కుర్రాడికి కూడా ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇప్పుడు 'సోగ్గాడే చిన్ని నాయన' పేరిట ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. 
 
కాగా, ఈ రోజు దర్శకుడు కల్యాణ్ జన్మదినం. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున నిన్న రాత్రి 12 గంటలకు దర్శకుడికి ఒక సర్ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశాడట. ఈ పార్టీకి ఇతర యూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారని సమాచారం. 
 
పోతే, నాగ్ తాతామనవళ్లుగా నటిస్తున్న ఈ సినిమాలో తాత సరసన రమ్యకృష్ణ, మనవడి పక్కన లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.