బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 4 జనవరి 2015 (22:05 IST)

బాలకృష్ణ కారు చోరీ.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాడుతున్న కారు చోరికి గురైంది. దానిపై ఇప్పటికే పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. తెలంగాణ పోలీసులు కారును వెతకడానికి నగరమంతటా గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమాలో ఓ కారును వినియోగిస్తున్నారు. షూటింగ్ జరిగే సమయంలో ఆ కారు చోరీకి గురైంది. కారును దొంగలు ఎత్తుకెళ్లారంటూ హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే నలుగురిని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. 
 
కాగా, ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే కథనాయకుడు, నాయకలుగా నటిస్తున్నారు.