శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (18:01 IST)

కళ్ళునచ్చాయంటున్న నందినిరెడ్డి!

సక్సెస్‌ సినిమా చేసినా.. అవకాశాలులేని దర్శకురాలు నందినీరెడ్డి. ఆమె చేసిన 'అలా మొదలైంది'లో నటీనటులకు మంచి అవకాశాలు వచ్చినా ఈమెకు మాత్రం రాలేదు. ఎట్టకేలకు 'జబర్‌దస్త్‌' అనే సినిమా తీసినా అది హిందీ సినిమాకు కాపీ కావడంతో రెండోరోజు తిరుగుటపాయి అంది. అప్పటి నుంచి మళ్ళీ ఏదో సినిమా చేయాలని ప్లాన్‌ చేసింది. ఇప్పటికి అది నెరవేరబోతుందని తెలిసింది. 
 
ఆమెతో మొదటి సినిమా తీసిన నిర్మాతే ఈ చిత్రాన్ని నిర్మింనున్నాడు. కథ సిద్ధమైంది. హీరోయిన్‌ కోసం జరిపిన వేటలో దాదాపు 400 మందిని చూశాక 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్‌ మాళవిక నాయర్‌‌ని ఎంపిక చేసింది. ఆమె కళ్ళు ఊహించుకోగానే నేను రాసుకున్న పాత్రకి తనే కరెక్ట్‌ అనిపించిందని నందిని రెడ్డి తెలియజేస్తుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్ళనుంది.