శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:53 IST)

ఉగాది పచ్చడి తినిపిస్తా: నాని

నానికి తమిళంలోనూ పేరుంది. తెలుగులోనే చేస్తానని చెప్పి.. తమిళానికి దూరమయినా తెలుగులో సక్సెస్‌ కోసం పట్టుపడుతున్నాడు. ప్రస్తుతం 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా చేశాడు. ఈ సినిమా ఉగాదికి విడుదల కానుంది. ప్రేక్షకులకు ఉగాది రుచి చూపిస్తానని నాని తెలియజేస్తున్నాడు. మాళవిక నాయర్‌లో జోడి కట్టిన నాని.. స్వప్న సినిమా పతాకంపై నాగ అశ్విన్‌ దర్శకత్వంలో నటించారు. ప్రియాంక దత్‌ నిర్మాత. ఈ చిత్రం ఉగాది రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ''ఒక కొత్త కాన్సెప్ట్‌‌తో రూపొందిన ఈ సినిమాని భారతదేశంలో మునుపెవ్వరూ చిత్రీకరించని ఎత్తయిన హిమాలయాల్లో చిత్రీకరించాం. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్‌‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎంత పీక్స్‌‌కి వెళ్లి చిత్రీకరించడం జరిగిందో ఆడియో కూడా అంత పీక్స్‌‌కి వెళ్లి ఘనవిజయం సాధించింది. 
 
ప్రస్తుతం పోస్ట్‌‌ప్రొడక్షన్‌ వర్క్‌ తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైనప్పటి నుండి ఆడియన్స్‌‌లో ఎక్స్పెక్టేషన్స్‌ చాలా పెరిగాయి. సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఉగాది రోజున విడుదలయ్యే మా చిత్రం ఉగాది పచ్చడిలానే అన్ని ఎలిమెంట్స్‌ కలిపి ఉంటుంది'' అని అన్నారు.