బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (20:34 IST)

నాని, మారుతీ 'భలేభలే మగాడివోయ్' మొదలైంది!

గత కొద్దికాలంగా సైలెంట్‌గా వున్న నాని సినిమాలు ఇప్పుడు ప్రారంభవుతున్నాయి. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సోమవారంనాడు ఆఫీసులో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలలోనే 'ఎవడే సుబ్రమణ్యం' విడుదల కానుంది. అదే సమయంలో గీతా ఆర్ట్స్‌ వంటి పెద్ద బ్యానర్‌లో నానికి అవకాశం వచ్చింది.

 
మారుతి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్‌ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. 'భలే భలే మగాడివోయ్‌' అనే టైటిల్‌ను పెట్టాలని సినిమా యూనిట్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్యారిక్టెర్‌ను సరికొత్తగా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రీదివ్య కథానాయికగా నటించనుంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగనుంది.