శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (13:44 IST)

'మయూరి'తో టాలీవుడ్‌కు.. తల్లిగా నయనతార...!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీ నయనతార. ఈ అందాల తార ఇటీవల కోలీవుడ్‌కే పరిమితమైనట్టు అక్కడ చిత్రాలనే చేస్తూ వస్తున్నారు. తెలుగులో అంతగా కనిపించడం లేదు. అయితే తాజాగా అమ్మడు 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే తల్లి పాత్రలో నట. 
 
ఇక విషయానికి వస్తే..  నయనతార తమిళంలో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి మొదట్లో 'నైట్ షో' అనే పేరు పెట్టారు. అయితే ఆ టైటిల్ నయన‌కు నచ్చకపోవడంతో, అమ్మడు సూచన మేరకు దానిని 'మాయ'గా మార్చారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో 'మయూరి' పేరిట అనువదిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఇందులో నయనతార తల్లి పాత్రలో కనిపిస్తుంది.