శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (12:39 IST)

బాలయ్యతో నయనతార మళ్లీ జోడీ.. 99వ సినిమాకు ఖరారు!

బాలకృష్ణతో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలలో నటించిన నయనతార ఆయనతో మరోసారి జతకడుతోంది. 'లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య నటించే తన 99వ చిత్రానికి ఈ ముద్దుగుమ్మను ఖరారు చేశారు.
 
ఈ చిత్రానికి ఆమె డేట్స్ కూడా కేటాయించినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఇందులో నటించడం కోసం తమిళంలో కొన్ని పెద్ద ప్రాజక్టులను కూడా నయన్ వదులుకుందట. 
 
ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ దీనికి రచన చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ 'ఎరోస్ ఇంటర్నేషనల్' నిర్మిస్తుందట.