శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:27 IST)

అందాల 'రాశి' రీఎంట్రీకి రెడీ... హీరోయిన్‌గానా?!

సినీ పరిశ్రమలో టాప్ రేంజ్‌లో వెలిగిన హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమై, కొంత కాలం తర్వాత అవకాశాలు వస్తే మళ్లీ రీఎంట్రీ అవుతుంటారు. ఆ కోవలో ఒకప్పటి హీరోయిన్ నటి రాశి చేరింది. గతంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన రాశి, వివాహం చేసుకుని తెరమరుగైంది.
 
ప్రస్తుతం ఇన్నాళ్లకు ఆమె మళ్లీ ముఖానికి రంగేసుకునేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాశికి ఇటీవల మళ్లీ అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలుపుతోంది. అయితే హీరోయిన్‌గా కాదట. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరో నరేష్, సుమన్ వంటి వారితో నటించే అవకాశాలు వస్తున్నాయని రాశి అంటోంది. గతంలో కంటే ఇప్పుడు స్లిమ్‌గా తయారయ్యానని రాసి తెలుపుతోంది. 
 
అయితే ఈమె అమ్మ, పిన్నమ్మ పాత్రలు చేయనని స్పష్టం చేస్తోంది. మరే పాత్రల్లో నటిస్తారని ప్రశ్నిస్తే తన అందానికి తగిన పాత్ర ఇస్తే చేస్తానని, అలనాటి నటి నదియా చేస్తున్న పాత్రలు వంటివి వస్తే నటించేందుకు రెడీ అంటోంది. ఈ భారీ ఎత్తుల సుందరికి రీఎంట్రీ సక్సెస్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.