శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (11:01 IST)

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం.. టైటిల్ ఖరారు..!

నేటి పోటీ ప్రపంచంలో ఒక సినిమా వెండితెరపై హిట్టు సాధించాలంటే సినిమా కథ నుంచి విడుదల తేదీ వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులోనూ ముఖ్యంగా సినిమా టైటిల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందువలనే ఒకే టైటిల్‌ కోసం పలువురు హీరోలు పోటీ పడుతుంటారు కూడా. 
 
స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ నిర్ణయించడం అనేది పెద్ద ప్రక్రియ. వాళ్ల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని క్యాచీగా, అభిమానులకు జోష్ ఇచ్చేలా టైటిల్ పెట్టాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం కోసం కూడా టైటిల్ విషయంలో పెద్ద కసరత్తే చేస్తున్నారు. 
 
చివరికి 'దండయాత్ర' అనే టైటిల్ ని చాలా వరకు ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ టాక్. 'టెంపర్' సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన 'ఇది దయాగాడి దండయాత్ర' డైలాగుకి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ 'దండయాత్ర' పేరును టైటిల్‌గా పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలతో బాటు ఎన్టీఆర్ కూడా సానుకూలంగా ఉన్నాడట. కాగా, ఏప్రిల్ 17 నుంచి ఈ చిత్రం షూటింగ్ యూకేలో జరుగుతుంది.