మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (14:29 IST)

నిఖిల్‌కు సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

'హ్యాపీడేస్‌'లో కాలేజీ లేడీ లెక్చరర్‌ను ప్రేమించే వ్యక్తి గుర్తుంది కదా.. నిఖిల్‌. చాలా ఏక్టివ్‌గా వుండేవాడు. సోలో హీరోగో పలు చిత్రాల్లో పెర్‌ఫార్మెన్స్‌ చేసేవాడు. అయితే అన్నింటికంటే 'కార్తికేయ' సినిమా అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు 'స్వామిరారా' కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో మూడో చిత్రంగా హ్యాట్రిక్‌ కోసం నిఖిల్‌ ఆశపడుతున్నాడు.

 
ఆ చిత్రమే 'సూర్య వర్సెస్ సూర్య'. ఈ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని కూడా హోలి రోజైన మార్చి 5న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అంతకుముందు దీపావళికి కార్తికేయ విడుదలైంది. స్వామిరారా కూడా కూడా ఓ పండుగ రోజు విడుదలైంది. ఈ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందని ఆశిస్తున్నాడు.