గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (16:03 IST)

లారెన్స్‌ ఆకాశానికెత్తేసిన నిత్యామీనన్: జెంటిల్మెన్ అంటూ కామెంట్!

కాంచన 2 గంగ సినిమా దర్శకుడు రాఘవ లారెన్స్‌పై నిత్యామీనన్ ప్రశంసల వర్షం కురిపించింది. లారెన్స్ పక్కా జెంటిల్మెన్ అంటూ కొనియాడింది. ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ మాట్లాడుతూ.. గంగలో కీలక పాత్ర పోషించిన నిత్యామీనన్.. లైఫ్‌లో అలాంటి రోల్‌ను అస్సలు మరిచిపోలేనని చెప్పింది. చాలా కష్టపడి గంగలో ఆ రోల్ చేశానని తెలిపింది. ప్రతి సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించాడని గంగలో తన పాత్ర కోసం తనకంటే ఆయనే ఎక్కువ కష్టపడ్డాడని తెలిపింది. 
 
గంగలో తాను ఆ రోల్ చేసేందుకు అస్సలు ఒప్పుకోలేదని, ఆ పాత్రకు తానైతే బాగుంటుందని లారెన్స్ ఒప్పించడంతో ఓకే చెప్పేస్తానని వెల్లడించింది. నటనా పరంగా మెలకువలను నేర్చుకునేందుకు గంగ సినిమా ఎంతగానో ఉపయోగపడిందని చెప్పింది. ఇంకా లారెన్స్ మానవతావాది. స్వల్ప కాలంలోనే ప్రముఖ దర్శకుడిగా లారెన్స్ ఎదిగాడని నిత్యామీనన్ కొనియాడింది.