బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (16:22 IST)

బాలీవుడ్‌కు వెళ్లనున్న మగధీర: రామ్‌చరణ్ పాత్రలో ఎవరు?

రాజమౌళి మగధీర బాలీవుడ్‌కు వెళ్లనుంది. ఇప్పటికే బెంగాలీలో మగధీర సినిమా రెడీ అవుతున్న తరుణంలో బాలీవుడ్‌లో మగధీరుడుగా నటించేందుకు సాహిద్ కపూర్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు. మగధీర సినిమాలో నటించాలనే ఆశ తనకుందని, ఈ సినిమాను తాను చూశానని తెలిపాడు. కథ నచ్చిందని, తప్పకుండా మగధీరలో చరణ్ పాత్ర పోషిస్తానని అన్నాడు. అయితే కచ్చితంగా ఈ విషయాన్ని ముందుగానే చెప్పలేనన్నాడు. 
 
ఇక హిందీ మగధీరకు సాజిద్ నదియావాలా దర్శకత్వం వహిస్తున్నారని షాహిద్ కపూర్ రామ్ చరణ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిస్టారికల్ రొమాన్స్ డ్రామా  మగధీరలో రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.