మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (12:47 IST)

'టెంపర్' రచయితతో ఎన్టీఆర్.. కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సూపర్ హిట్టు సాధించిన చిత్రం 'టెంపర్'. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ ఈ సారి ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ రచయిత చెప్పిన స్టోరీ లైన్ కు ఈ నందమూరి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 
 
ఈ విషయం గురించి వంశీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో నెక్ట్స్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఓ సబ్జెక్ట్ పై డిస్కషన్ చేస్తున్నామన్నారు. తాను తెలిపిన పాయింటు ఎన్టీఆర్‌కి కూడా నచ్చిందని, దీంతో ఆ సబ్జెక్ట్‌ను డెవలప్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త తరహా క్యారెక్టర్‌లో అదరగొడతారని వంశీ వెల్లడించారు.