గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (13:09 IST)

ఎన్టీఆర్-పూరీ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రెడీ!

ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచీ అనేక సమస్యలతో సాగుతోంది. మొదట్లో కథకు మార్పులు చేయాలని ఎన్టీఆర్ పట్టుబట్టడం ... తర్వాత పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాత కోరడం... జరిగాయి. అవి పరిష్కారం అయ్యాయనుకుంటే, తాజాగా ఈ చిత్రనిర్మాణం నుంచి బండ్ల గణేష్ తప్పుకున్నాడనీ, పూరీ దీనిని టేకోవర్ చేశాడనీ కూడా ప్రచారం జరిగింది. 
 
అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని చెప్పడానికి త్వరలో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ నెలాఖరు కల్లా ఎన్టీఆర్-పూరీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్‌ కానుందని తెలిసింది. ఇక ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.