బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (15:13 IST)

ఫితూర్‌లో కత్రినా కొత్త లుక్... గుర్రం స్వారీ చేస్తూ... కింద పడిందా?

కత్తి లాంటి అందాలతో అభిమానులను ఉర్రూతలూగించే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఫితూర్. ఈ సినిమా ద్వారా కత్రినా తొలిసారిగా  ఆదిత్యరాయ్ కపూర్‌తో కలసి రోమాన్స్ చేస్తోంది. సరికొత్త సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కత్రినా, ఆదిత్యరాయ్‌ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు భిన్నంగా చూపించబోతున్నారట. అంతేకాకుండా ఇందులో కత్రినా ఓ సన్నివేశంలో గుర్రం స్వారీ చేస్తూ కనిపిస్తుందట.
 
అయితే షూటింగ్‌లో భాగంగా కత్రినా గుర్రం స్వారీ చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె అదుపుతప్పి దాదాపు కింద పడిపోయిందట. అయితే యూనిట్ సభ్యులు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ఆమెను పట్టుకోవడంతో దెబ్బలు ఏమీ తగలకుండా తప్పించుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ద్వారా తెలిపింది.
 
అయితే ఆ తర్వాత మాత్రం కత్రినా ఏమాత్రం భయపడకుండా, ధైర్యంగా మళ్ళీ గుర్రం ఎక్కి షూటింగ్ పూర్తి చేసిందట. కాగా ఈ సినిమాలో గుర్రం స్వారీ చేసే సన్నివేశాలు భిన్నంగా ఉంటాయని సమాచారం. ఫితూర్ సినిమాకి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా, నటి రేఖ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.