గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (19:13 IST)

కోటకు పద్మ అవార్డు... మరి కైకాలకు ఎప్పుడిస్తారు...?

పద్మ అవార్డులు.. అనేవి కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వుంటే ఆ ప్రభుత్వం అనుకూలురుకు ఇవ్వడం పరిపాటి. తాజాగా పద్మ అవార్డులో పెద్దగా వివాదాస్పద అంశాలు లేకపోయినా.. సినిమా రంగంలో మాత్రం... కోట శ్రీనివాసరావుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తను గతంలో బిజెపి ఎంఎల్‌ఎగా ఎన్నికై, మరలా ఓడిపోయారు. అయినా బిజెపి మూలాలు ఆయనకు ఎక్కడా పోలేదు. 
 
ప్రస్తుతం కోట శ్రీనివాసరావు కంటే.. కైకాల సత్యనారాయణ ఉద్దండుడు. కైకాలనే చాలాసార్లు కలిసినప్పుడు మీకు కేంద్రం నుంచి సరైన గుర్తింపు రాలేదని కోట అంటుండేవారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆలోచనలను రేపింది.
 
గతంలో పరిశీలిస్తే... విశ్వనట చక్రవర్తిగా పిలువబడే ఎస్‌వి రంగారావుకు పలు సంస్థలు ప్రభుత్వం గౌరవించింది. నర్తనశాలలో ఆయన చేసిన కీచక పాత్రకు జకార్తా ఫిలిం ఫెస్టివల్‌ ఎంపిక చేసింది. తెలుగు, తమిళ భాషల్లో చేసినా... కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు అదే బాటలో సత్యనారాయణ వున్నాడని కామెంట్లు విన్పిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ అలనాటి తరంతోనూ, ఈనాటి తరంతోనూ వేషాలు వేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 
 
గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2011లో రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పద్మ అవార్డు మాత్రం ఆయనకు దక్కలేదు. ఒక సినీయర్‌ నటుడిగా, ప్రస్తుతం చరమాంకంలో వున్న సత్యనారాయణను తగు విధంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా వుందని సినీ పండితులు పేర్కొంటున్నారు.