శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (19:08 IST)

వీణామాలిక్‌ కెరీర్ 26ఏళ్ల జైలు శిక్ష, రూ.13 లక్షల జరిమానాతో ఓవర్!?

శృంగార తార వీణామాలిక్‌ సినీ కెరీర్ ప్రశ్నార్థకమైంది. వీణామాలిక్‌కు 26 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధించారు. దీంతో ఆమె సినీ కెరీర్ ముగిసినట్లేనని సినీ పండితులు అంటున్నారు. 
 
ఇస్లాం మతాన్ని కించపరుస్తూ, దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని యాంటీ టైజమ్ కోర్టు అభిప్రాయపడింది. దీంతో పాకిస్తాన్ అందాల నటి వీణామాలిక్‌‌కు అక్కడి కోర్టు 26 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిది, జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రెహ్మాన్ లకు కూడా ఇదే శిక్ష విధించింది. 
 
అసలు జరిగింది ఏమంటే... ఈ మధ్యనే వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త, దుబాయికి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్‌లు జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్లారు. 
 
ఈ సందర్భంగా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పాటను ప్లే చేశారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్‌లు డాన్స్ చేసారు. అది ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. 
 
ఈ షో ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు ఫిర్యాదు చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దోషులకు 26 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.