శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (14:09 IST)

గోపాలుడికి రూ.15 కోట్లు... వాటా ముట్టినట్టేనా...!

టాలీవుడ్‌లో బాక్సాఫీను బద్దలుకొడుతున్న చిత్రం 'గోపాల గోపాల'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటే‌ష్‌లు హీరోలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన అంచనాలకు తగ్గట్టుగానే లాభాలను అందిస్తోంది. ఇదిలా ఉంచితే ఈ చిత్రంలో నటించినందుకు పవన్ కళ్యాణ్, వెంకటేష్‌లు ప్రత్యేకగా పారితోషికం ఏమీ తీసుకోలేదట.
 
అయితే వచ్చే లాభాల్లో వాటాలు కోరుకున్నారట. ఆ ప్రకారం వెంకటేష్‌కు వాటాగా 6.5 కోట్లు దక్కింతే, పవన్ కళ్యాణ్‌కు 15 కోట్ల రూపాయలు వాటా అందిందట. ఇక నిర్మాతల్లో ఒకరైన శరత్‌‌కు ఐదు కోట్లు రూపాయలు లాభవం వచ్చినట్లు సినీ యూనిట్ సమాచారం. కాగా పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో కేవలం 50 నిమిషాలే కనిపించినా భారీ మొత్తమే ముట్టింది.