గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:02 IST)

పేరెంట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్న శ్రీజ..!

ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవన్ కళ్యాణ్ చేతి చలువతో కోలుకున్న శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు టాలీవుడ్ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శ్రీజ తన సోదరి, తల్లిదండ్రులతో కలిసి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సంభాషించారు. 

 
శ్రీజను పవన్‌కళ్యాణ్ ఖమ్మం లోని ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పరామర్శించి, ఆమె ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. కాగా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ పైన మాటల రచయిత, దర్శకుడు కోన వెంకట్ పొగడ్తల జల్లు కురిపించారు. అదేమిటో చూడండి.