శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (09:39 IST)

ఊపందుకున్న 'గబ్బర్ సింగ్ 2'... పవన్ డేట్స్ ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'గబ్బర్ సింగ్-2' చిత్రం ఊపందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయట. అంతేకాదు, పవన్ కల్యాణ్ తన డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. 
 
దీంతో చిత్రం షూటింగును ఏప్రిల్ చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పూర్తయ్యే వరకు నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది. కె.యస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ దీనిని నిర్మిస్తున్నారు.