గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:49 IST)

పవన్ కళ్యాణ్ బాహుబలి గెటప్... శ్రీజ కుటుంబ సభ్యులు మీట్... నెక్ట్స్ ఆంధ్రా సీఎం?

బాహుబలి సినిమా గెటప్పును ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. అదేనండీ బాగా గడ్డాలు, జుట్టు పెంచి రానా, ప్రభాస్ ఇద్దరూ కత్తులు, కటార్లు తీసుకుని కనిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి స్టయిలునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపించేశాడు. ఇది సినిమా కోసమో లేదంటే మామూలుగా ఇలా ఉన్నారో తెలియడం లేదు. కానీ సమ్ థింగ్ స్పెషల్ గా కనబడ్డారు. 

 
ఆమధ్య ఖమ్మంలో తీవ్ర అనారోగ్యానికి గురయిన శ్రీజను పరామర్శించి ఆమెకు ఆర్థిక సాయం కూడా చేసిన పవన్ కళ్యాణ్ ఆమెకు మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. పవన్ చేతి చలువ వల్ల ఆమె ఆరోగ్యవంతురాలయింది. పవన్ కళ్యాణ్ చేతి స్పర్శకు మహత్యం ఉన్నదని కొందరు అనుకుంటున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువనీ, అలాగే మానవీయ విలువలతో కూడిన ఆయన స్పర్శతోనే శ్రీజ తిరిగి కోలుకున్నదని అంటున్నారు. 
 
ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఆంధ్రా సీఎం అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే జ్యోతిష పండితులు ఓ సినీ నటుడే తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పిన దరిమిలా ఆ నటుడు పవన్ కళ్యాణే అనే చర్చ నడుస్తోంది.