శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (10:07 IST)

పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ.. ఇక పండగే!

పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పవన్‌కళ్యాణ్, బాలకృష్ణల కాంబినేషన్‌లో చిత్రం రూపొందనుందనే రూమర్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. 
 
ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 98వ చిత్రంగా రూపొందే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతోంది. 
 
ఇదిలా ఉండగా బాలకృష్ణ 99వ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడు. అలాగే బాలయ్య 100వ చిత్రానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, అందుకోసం ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని సమాచారం. 
 
పవన్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గబ్బర్‌సింగ్-2 సెట్స్‌పైకి రానుంది. మరి బాలకృష్ణతో పవన్‌కళ్యాణ్ నటిస్తాడన్న వార్త ఎంతో సంచలనం సృష్టిస్తోంది. ఇదే గనక నిజమైతే టాలీవుడ్‌లో సంచలన చిత్రంగా మారడం ఖాయమని సినీ జనం అనుకుంటున్నారు.