మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (13:08 IST)

'కత్తి... కత్తి' అంటూ గబ్బు లేపారు... చివరికేమైంది... పవన్ నో చెప్పాడు...

తమిళ నటుడు విజయ్ కత్తి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని ఠాగూర్ మధు ప్లాన్ చేశారని అక్కడా ఇక్కడా ఎక్కడంటే అక్కడ తెగ వార్తలు వచ్చాయి. కానీ మధు కేవలం కత్తిని డబ్బింగ్ రైట్స్ మాత్రమే తీసుకున్నాడనే వార్త తెలిసిందే. ఐతే ఏదేమైనప్పటికీ కత్తిని రీమేక్ చేస్తే బావుంటుందని, అది పవన్ కళ్యాణ్ కు సూటవుతుందని చెప్పడంతో... మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తిని నిన్న సాయింత్రం స్పెషల్ షో వేసుకుని చూసినట్లు తెలుస్తోంది. 
 
ఐతే ఆ చిత్రం లైన్ పవన్ కళ్యాణ్ కు పెద్దగా పట్టుకోలేదనీ, అందువల్ల ఇక దానిని రీమేక్ చేసే అవకాశం లేదని టాలీవుడ్ న్యూస్. ఫలితంగానే నవంబర్ 21 వ తేదీన కత్తి డబ్బింగ్ వెర్షన్ పంపిణీ చేస్తున్నట్లు, ఆ తేదీని కూడా ప్రకటించినట్లు చెపుతున్నారు. మరోవైపు చిత్రంలో 2జి స్పెక్ట్రమ్ స్కాంల వంటివి ఉండటం... దానిపై కోర్టు కేసులు సాగుతుండటంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నట్లు సమాచారం.