మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:52 IST)

"గోపాల గోపాల": నవంబర్ నెలాఖరులో పవన్ లుక్!

పవన్ కల్యాణ్ - వెంకటేశ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయ్యింది. ఈ చిత్రానికి సంబంధించి పవన్ కల్యాణ్ వర్క్ నవంబర్ రెండో వారంలో పూర్తవుతుంది. ఈ చిత్రంలో ఆయన మోడ్రన్ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నారు. 
 
ఆ వేషంలో పవన్ ఈ చిత్రంలో ఎలా ఉంటాడా? అని ఆయన అభిమానులు ఆసక్తి‌గా ఎదురుచుస్తున్నారు. వారిని ఆనందపరిచే రీతిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ నెలాఖరులో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.