గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2014 (20:45 IST)

పవన్‌ పుట్టినరోజు కానుకగా 'పవనిజం'

పవన్‌ కళ్యాణ్‌ స్పూర్తిగా తీసుకుని కొంతమంది అభిమానులు రూపొందించిన 'పవనిజం' అనే చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు కానుకగా  సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఇ.కె. చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్‌, నరేష్ నిర్మిస్తున్నారు. అభిమానులు తలచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో అనేది ఈ చిత్ర కథాంశం. 
 
నిర్మాతలు మాట్లాడుతూ.. చిత్ర నిర్మాణంలో పవన్‌ ఫ్యాన్స్‌ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. అన్నివర్గాల వారినీ ఆకట్టుకునేలా వుంటుందన్నారు. సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు. కనిష్క అందించిన స్వరాలు ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.