బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (13:49 IST)

సోనమ్‌కు స్వైన్ ఫ్లూ: షాక్‌తో స్వైన్ ఫ్లూ టీకా వేయించుకున్న త్రిష

దేశాన్ని స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్ సినీ యాక్టర్ అనిల్ కుమార్ కుమార్తె, అందాల భామ సోనమ్ కపూర్ స్వైన్ ఫ్లూ బారిన పడిందని వార్తలు రావడంతో సినీ నటులంతా స్వైన్ ఫ్లూ అంటే భయపడిపోతున్నారు. ఇంకా స్వైన్ ఫ్లూ రాకముందే నివారించాలనే ఉద్దేశంతో టీకాలు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాది హీరోయిన్ త్రిష స్వైన్ ఫ్లూ టీకా వేయించుకుంది. 
 
అంతేకాదు.. మామూలుగా అయితే, తనకు కనీసం సూది వేయించుకోవాలన్నా భయమని, కానీ, స్వైన్ ఫ్లూ భయంతో వ్యాక్సిన్ వేయించుకున్నానని త్రిష తెలిపింది. అంతటితో ఆపకుండా.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా సలహా ఇస్తోంది. తాను స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోను ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ చేసింది.