గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (18:45 IST)

పీకే టీజర్‌ను విడుదల చేసిన అమీర్ ఖాన్!

పీకే టీజర్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ విడుదల చేశారు. గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రంలో ఈ చిత్ర హీరో ఆ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా హిట్టవ్వాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. 
 
తన సినిమాలు ఎక్కువగా క్రిస్మస్‌కు విడుదలవడం కాకతాళీయమని చెప్పాడు. రాజ్ కుమార్ హిరానీ చిత్రాలన్నింటిలానే 'పీకే' కూడా మంచి సందేశాత్మక చిత్రమన్నాడు. ఈ సినిమాలోని పాత్ర తన కెరీర్లోకెల్లా అత్యంత క్లిష్టమైనదని తెలిపాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటు అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెల్సిందే.