శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (12:02 IST)

''జబర్దస్త్''కు కష్టాలు: గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు!

''జబర్దస్త్'' కష్టాలు తప్పట్లేదు. ఈ-టీవీలో ప్రసారమయ్యే మిక్కిలి ప్రజాదరణ పొందిన టెలివిజన్ కామెడీ షో 'జబర్దస్త్' పై గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ నెల 18న రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. 
 
'జబర్దస్త్' టీం, న్యాయనిర్ణేతలతో పాటు ఈ-టీవీ యాజమాన్యంపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. అన్ని అంశాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.