శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (11:34 IST)

అల్లు అర్జున్ తాగి డ్రైవ్ చేశాడా? లేదా ? వీడియో చూడండి..

అల్లు అర్జున్ తాగి డ్రైవ్ చేశాడనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ఐయామ్ దట్ ఛేంజ్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన తర్వార అల్లు అర్జున్‌కు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రాత్రిపూట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రొటీన్ చెకప్‌లో భాగంగా అల్లు అర్జున్‌ని ఆపుచేసి పంపేసారు. 
 
అయితే ఈ వీడియోని చూసిన వారు కొందరు అల్లు అర్జున్ త్రాగి డ్రైవ్ చేస్తున్నాడంటూ కామెంట్ చేస్తూండగా... త్రాగి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఆపుదురు.. అలాంటిదేమి లేదని మరికొందరు అంటున్నారు. 
 
నిజానిజాలు తెలియకపోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తోంది. సినిమాల విషయానికి వస్తే... అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి అనే కీలక పాత్రను అల్లు అర్జున్‌ పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రీకరణ సోమవారంతో పూర్తయింది.