బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (15:56 IST)

కోర్టు చుట్టూ తిరుగుతున్న కన్నడ నటి పూజా గాంధీ

కన్నడ సినీ యాక్టర్ పూజా గాంధీ కోర్టు చుట్టూ తిరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలోని రాయచూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా ఫలితం లేదు. ఓడిపోయింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించినట్లు పూజా గాంధీపై కేసు నమోదైంది. 
 
ఈ కేసుకు సంబంధించి పూజా గాంధీ ఈ శుక్రవారం కోర్టుకు హాజరైంది. ఈ కేసుని విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ రెండవ వారంలో తాను నటించిన “అభినేత్రి” అనే చిత్రం రిలీజ్ కానుందని పూజా గాంధీ తెలిపింది.