గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (10:12 IST)

పూనమ్ పాండే హాట్ యోగా: ఎగబడుతున్న యంగర్స్.. 20లక్షల మంది..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కోట్లాది మంది యోగాపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశ్వవ్యాప్తంగా జనం యోగాసనాల బాటపట్టారు. ఈ నేపథ్యంలో సంచలనాలకు కేంద్ర బిందువైన మోడల్ పూనమ్ పాండే కూడా యోగా పాఠాలు చెప్తోంది. యోగా అంటే తనకూ ఇష్టమేనని చెప్తున్న పూనమ్ పాండే ‘హాట్ యోగా’ పేరిట ఓ వీడియోను యూట్యూబ్‌లో పెట్టేసింది. 
 
ఈ వీడియోను యువత విరగబడి చూస్తోందట. కేవలం మూడంటే మూడు రోజుల్లో ఈ వీడియోను 20 లక్షల మంది వీక్షించారట. పూనమ్ పాండే లేటెస్ట్‌గా తన న్యూడ్ ఫోజ్‌ను నెట్‌లో ప‌బ్లిష్ చేసి భారీ లైక్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. తన డెబ్యూ ఫిల్మ్ నషాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే.