శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (12:30 IST)

అదే బాటలో ప్రభాస్..! లాఠీ పట్టేందుకు రెడీ..!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో పోలీస్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసు సబ్జెక్టులకు ప్రేక్షకాదరణ బాగుండడంతో ప్రస్తుతం మన హీరోలంతా వాటిపైనే దృష్టి సారిస్తున్నారు. తాజాగా హిట్టయిన 'టెంపర్'లో కూడా ఎన్టీఆర్ ఇలాంటి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర నటించిన హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో యంగ్ హీరో ప్రభాస్ కూడా అలాంటి పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అందుకే, తన తదుపరి చిత్రానికి పోలీస్ బ్యాక్ డ్రాప్ కథను సిద్ధం చేయమని దర్శక నిర్మాతలకు తెలిపారట. దీంతో సరికొత్త రీతిలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కథను ఆయన కోసం తయారుచేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంచితే, ఆయన నటించిన భారీ చిత్రం 'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలో విడుదలకు రెడీ అవుతోంది.