శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:41 IST)

తమిళ హీరోలకు 'బాహుబలి' హీరో ప్రభాస్ సూపర్ షాక్... తమిళంలో రాశాడు...

తమిళ హీరోలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన ట్వీట్ కు షాకయ్యారు. ఇంతకీ ప్రభాస్ ఏం చేశాడయా అంటే... తమిళ సంవత్సరాది ఉగాది మొన్న సోమవారంనాడు అంతా జరుపుకున్నారు. కానీ ఎర్ర కూలీలను ఏపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపధ్యంలో ఆ ప్రాంతంలో సంవత్సరాది వేడుకలు కొద్దిగా బోసిపోయాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ప్రభాస్ తమిళ సోదరసోదరీమణులకు తమిళ సంవత్సర శుభాకాంక్షలంటూ ట్విట్టర్లో తమిళంలో చక్కగా డిజైన్ చేసి పోస్ట్ చేశాడు. 
 
దీంతో తమిళ హీరోలు ప్రభాస్ శుభాకాంక్షలు చూసి కొందరు తాము కూడా చకచకా ఇచ్చేశారనుకోండి. ఐతే ప్రభాస్ శుభాకాంక్షల వెనుక మరో కోణం ఉందంటున్నారు సినీజనం. అదేంటయా అంటే... బాహుబలి చిత్రం తమిళంలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో తెలుగు ఆంధ్ర హీరో అయిన ప్రభాస్ చిత్రాన్ని ఇటీవలి ఎన్ కౌంటర్ దరిమిలా ఎలాంటి అడ్డు రాకుండా ఉండేందుకే ఇలాంటి ట్వీట్ చేశారని అంటున్నారు. శుభాకాంక్షలు చెప్పినా ఇలా భూతద్దంలో చూడ్డమేంటి గురూ అని మరికొందరంటున్నారు.