శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 18 జూన్ 2014 (11:33 IST)

ప్రభుదేవా షాకింగ్ నిర్ణయం: ఆడతోడు అవసరం లేదట!

ప్రముఖ దర్శకుడు, నటుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకొచ్చిన వ్యక్తి. భార్యకు విడాకులివ్వడం, ఆ తర్వాత నయనతారతో ప్రేమ విఫలమవడం అన్నీ ఆయనకు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కానీ ఆయన అన్నింటినీ తట్టుకుని ఇపుడు బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.

నయనతారతో విడిపోయిన తర్వాత ప్రభుదేవా తాజాగా బాలీవుడ్‌లో ఓ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని ప్రచారం మొదలైంది. అయితే ఆ పుకార్లను ప్రభుదేవా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఏకంగా ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం మితిమీరిపోవడంతో ప్రభుదేవా నోరు విప్పాల్సి వచ్చంది.

ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నీ నిజం కాదు. వాస్తవంగా మాట్లాడాలంటే నాకు ఆడతోడే అవసంలేదు అని కుండబద్దలుకొట్టి చెప్పాడు. ప్రభుదేవా అంత వైరాగ్యంతో మాట్లాడటానికి కారణం నయనతార వ్యవహారం తనకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టినందుకా? లేక మనిషి పూర్తిగా మారిపోయి మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాడా? అని అతనివైపు అనుమానపు చూపులు చూస్తున్నారు బాలీవుడ్ జనం.