గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:25 IST)

కమల్ హాసన్‌ సినిమాకు ప్రభుదేవా.. దర్శకత్వం..!

కమల్‌హాసన్‌ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ప్రభుదేవాకు దక్కింది. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్టు కోలీవుడ్ సమాచారం.

కమల్ కోసం ప్రభుదేవా ఇప్పటికే ఓ సబ్జెక్టు తయారుచేసుకున్నాడట. దీనికి కమల్ నుంచి అనుమతి లభిస్తే ఇక ఇది సెట్స్‌కి వెళుతుంది. ఈ చిత్రాన్ని వాసన్ విజువల్ వెంచర్స్ సంస్థ నిర్మిస్తుంది.
 
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించిన ప్రభుదేవా.. త్వరలో కోలీవుడ్‌లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అదీ కమల్ హాసన్‌తో దక్షిణాదిన సినిమా చేసేందుకు ప్రభుదేవా రెడీగా ఉండటంతో.. ఆ మూవీపై అభిమానుల మధ్య భారీ అంచనాలున్నాయి.