శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (11:30 IST)

ప్రియమణికి వరుడు రెడీ: సెకండ్ వైఫ్ కంటే.. ఫస్ట్ వైఫ్‌గానే?

హీరోయిన్‌గా ప్రియమణి కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కుటుంబసభ్యులు గత ఏడాది నుంచే ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

ఈ మేరకు, ప్రియమణి వరుడి కోసం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అనేక మ్యారేజ్ బ్యూరోలను వారు సంప్రదించారు. ప్రియమణిని మంచి బిజినెస్ మ్యాన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని వారు ముందు భావించారు. కానీ, వారనుకున్నట్టు బిజినెస్ సర్కిల్‌లో ప్రియమణికి మంచి సంబంధాలు దొరకలేదట.
 
దీంతో, ఆఖరికి కేరళకు చెందిన ఓ సినిమాటోగ్రాఫర్‌తో ప్రియమణి పెళ్లిని ఖాయం చేసారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ప్రియమణి కూడా ఖరారు చేసింది. పెద్ద బిజినెస్ మ్యాన్‌కి సెకెండ్ వైఫ్‌గా ఉండడం కన్నా సినిమాటోగ్రాఫర్‌కి ఫస్ట్ వైఫ్‌గా ఉండడం మేలని ఆమె మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించింది. తన పెళ్లికి సంబంధించిన వివరాలను త్వరలో ఎనౌన్స్ చేస్తానని ప్రియమణి తెలిపింది.