శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (17:08 IST)

నటి ప్రియాంకా చోప్రా భవంతిలో గప్‌చిప్‌గా వ్యభిచారం!!

బాలీవుడ్ నటి, ఒకనాటి ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా నివాసముండే భవంతిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈమె నివశిస్తున్న భవంతిలో 'చరిష్మా స్పా' పేరిట వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గుట్టురట్టు చేశారు. 
 
ఈ భవంతిపై దాడి చేసి స్పా మేనేజర్ దినేష్‌ను, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. స్పా యజమాని మాణిక్ సోనీ పరారీలో ఉన్నాడు. ప్రియాంకా చోప్రాకు చెందిన ఈ భవంతిలో కొంతభాగాన్ని మాణిక్ సోనీ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
కాగా, ప్రియాంకా చోప్రా, ఆమె తల్లి మధు కూడా ఈ స్పాకు వస్తుండేవారని పోలీసులు తెలిపారు. స్పాపై పోలీసుల దాడి జరిగిన దాదాపు 3 వారాల తరువాతే భవన యజమాని ప్రియాంకా చోప్రా అన్న విషయం తెలిసింది. ఇదే స్పా పక్కనే ప్రియాంకా చోప్రా తల్లి ఓ చిన్న క్లినిక్‌ను నిర్వహిస్తుండటం గమనార్హం.