గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (17:01 IST)

ప్రియాంకా చోప్రా భారీ డీల్.. ఇక వెండితెర నుంచి బుల్లితెరకు?

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా వెండితెర నుంచి బుల్లితెరకు రానుంది. అయితే అది మనదేశంలో కాదండోయ్.. అమెరికాలోని ప్రఖ్యాత టెలివిజన్ నెట్ వర్క్ ABCతో ఆమె చేతులు కలుపుతోంది. ఇందుకు సంబంధించి ఆ టీవీ నెట్ వర్క్ సంస్థతో ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది పాటు కొనసాగే డీల్ కుదుర్చుకుంది. 
 
తద్వారా అమెరికా టీవీ నిర్మించే సీరియల్‌లో ప్రియాంకా నటించాల్సి వుంటుంది. భారీ మొత్తంతో ఈ డీల్ కుదిరిందనీ, తొలిసారిగా ఓ భాలీవుడ్ భామకు ఇలాంటి అవకాశం వచ్చిందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల ఈ బాలీవుడ్ చిన్నది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యే అవకాశం వుంది. ఇప్పటికే గత సంవత్సరం చేసిన 'ఎగ్జోటికా' పాప్ ఆల్బం ద్వారా ప్రియాంకా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.