శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:18 IST)

పోర్న్ సినిమా చేస్తున్నానా...?! అది నాన్సెన్స్ న్యూస్... వర్మ ఆగ్రహం

ఎప్పుడూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సంచలనాలు సృష్టించే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సంచలనాత్మక వార్త వెల్లడైంది. రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ శృంగార తారతో పోర్న్ సినిమా తెరకెక్కిస్తున్నట్టు ఒక ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. అటువంటి సినిమాలకు మన దేశంలో అనుమతి లేకపోవడంతో ఆయన అమెరికాలో ఆ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలో ఉంది. ఈ వార్త చూశాక మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు. 
 
‘నేను అడల్డ్ సినిమా చేస్తున్నానని అనేది నాన్సెన్స్ న్యూస్. ఓ జర్నలిస్టు ఇలాంటి వార్త రాసే ముందు కనీసం చెక్ చేసుకోవాలి’ అన్నారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మొగలిపువ్వు, కిల్లింగ్ వీరప్పన్, అటాక్ సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన కొందరు సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మను ఈ మాత్రం టెంక్షన్ పెట్టడం కరెక్టే.. తిక్క కుదిరింది అని చెవులు కొరుక్కుంటున్నట్టు సమాచారం.