శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 28 మే 2014 (12:55 IST)

ప్రకాశ్ రాజ్ ''ఉలవచారుకి..." పేరు పెట్టిన పూరీ!

ప్రస్తుత రోజుల్లో సినిమాలు 100రోజులమాట పక్కనపెడితే 50రోజులు ఆడటం చాలా కష్టమైపోతోంది. తమ సినిమాలు సక్సెస్ సాధించాలంటే టైటిల్ దగ్గరనుండే దర్శక, నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండే టైటిల్ పెట్టి సినిమాలకు పబ్లిసిటీ పెంచుకుంటున్నారు.

తాజాగా నటుడు, దర్శకుడు ప్రకాశ్ రాజ్ తన కొత్త సినిమా 'ఉలవచారు బిర్యానీ' టైటిల్ పెట్టే విషయంలో చాలా ఇబ్బందిపడ్డాడట. అయితే దీని గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... "ఈ సినిమాకి ఏం పేరు పెడదామా? అని తెగ ఆలోచిస్తుంటే నా మిత్రుడు పూరీ జగన్నాథ్ ఈ పేరు పెట్టాడు.

ఓ రోజు ఇద్దరం ఫ్లయిట్‌లో వెళుతుంటే నా పక్కనే కూర్చున్న పూరీ 'దీనికి ఉలవచారు బిరియానీ అయితే బాగుంటుంది, పెట్టుకోండి' అన్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే, కథకు బాగా సూట్ అవుతుంది. అందుకే మరోమాట లేకుండా ఫిక్స్ చేశాను" అని చెప్పాడు.