శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 ఆగస్టు 2014 (18:43 IST)

రైతు పోరాటానికి 75 ఏళ్లు...

'దున్నే వాడిదే భూమి' రూపొందిన 'రైతుబిడ్డ' జమీందార్లకి, రైతులకు మధ్య జరిగిన పోరాటమే 1939లో సంచలనం సృష్టించిన 'రైతుబిడ్డ' సినిమా. 'వచ్చేది రైతు రాజ్యం యేలేది రైతు సంఘం' అనే నినాదంతో రూపొందిన 'రైతుబిడ్డ' సినిమా నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1939 ఆగస్టు 27న విడుదలై సామాజిక దృష్ట్యా కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆనాడు ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. బానిసబతుల నుంచి విముక్తి కోసం పోరాటం చేయడానికి పునాది అయ్యింది. ఐతే అప్పుడప్పుడే తెలుగు సినిమా జీవం పోసుకుంటున్న రోజుల్లో ఇలాంటి గొప్ప సినిమా రావడం అద్భుతం అని చెప్పవచ్చు.
 
అప్పటికే 'మాలపిల్ల' అనే సినిమా తీసి తన సాహస ప్రవృత్తికి చాటుకున్న దర్శకుడు రామబ్రహ్మం మరో సాహసానికి తెరలేపారు. జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా 'రైతుబిడ్డ' అనే  సినిమాను తెరకెక్కించారు. 1925లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం చత్రం కింద జాగృతలైన  సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో గూడుపల్లి రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు. 
 
ఈ సినిమాను వ్యతిరేకత సనాతన వర్గాల కంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. దీంతో ఈ సినిమాను అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇందులో విశేషమేమంటే ఈ సినిమాను నిర్మించింది జమిందారే. 
 
రైతుబిడ్డ సినిమాను నిషేధించినా ఈ మూవీ మంచి విజయం సాధించింది. అయితే 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన 'రోజులు మారాయి' చిత్రానికిది కొనసాగింపు అని చెప్పవచ్చు. కుల వ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వార ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు. 1939 అక్టోబరులో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుకు ప్రచారంగా ఈ చిత్రం తోడ్పడింది.