గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:54 IST)

వీర శంకర్‌ దర్శకత్వంలో రాజమౌళి యాక్టింగ్

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ ఆమధ్య ఓ సినిమా తీశాడు. దానికి 'మన కుర్రాళ్ళే' అని పేరు పెట్టారు. గతంలో వేరే టైటిల్‌ వుంది. కాగా, ఈ సినిమా సెజ్‌లకు సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. పొలం పనులు చేసుకుని హాయిగా కాలం వెళ్ళబుచ్చే గ్రామాల్లో... బడా పెట్టుబడిదారులు భూముల్ని కొని.. వాటిని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలుగా మార్చేస్తే.. పల్లెటూరు.. పట్టణాల్లో వున్న యూత్‌ ఎటువైపు మొగ్గుచూపుతుంది? యువత ఏం కోల్పోతుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ చిత్రంలో చక్కటి సందేశం ఇచ్చే పాత్రను రాజమౌళి పోషించినట్లు తెలిసింది. ఈ చిత్ర కథ, వీరశంకర్‌పై వున్న స్నేహంతో ఆయన ఇందులో నటించారు. మరి అంతా కొత్తవారు నటించిన ఈ చిత్రంలో రాజమౌళి ఎంట్రీ ప్రత్యేకంగా వుంటుందో లేదో చూడాలంటే.. నవంబర్‌ వరకు ఆగాల్సిందే.