గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:39 IST)

ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజమౌళి సారీ ఎందుకు చెప్పారు...?

దీపావళి రోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పాత్రకు సంబంధించి ‘బాహుబలి’ మేకింగ్ వీడియో వస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ జక్కన్న ప్రభాస్ బాణాన్ని అర్జునుడిలా ఎక్కుపెడుతూ ఉన్న ‘బాహుబలి’ లుక్‌ను విడుదల చేశారు. ఐతే ఈ ఫోజును చూసినప్పటికీ ప్రభాస్ అభిమానులు చల్లారలేదు. 
 
దాంతో రాజమౌళి నేరుగా స్పెషల్ వీడియో ద్వారా లైన్లోకి వచ్చాడు. అందులో... మీ హీరోని రెండేళ్లుగా మీకు దూరం చేశాను అంటూనే ఒక పెద్ద సినిమా అందించాలనే ఉద్దేశంతో ఆలస్యమయ్యిందని విరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు... చిత్రం చూశాక మీ కోపం చల్లారిపోతుందంటూ చెప్పాడు. షూటింగ్ పని ఒత్తిడి వల్ల బాహుబలి లోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియో తయారుచేయలేదని స్పష్టం చేశారు. మరి నిజంగానే విడుదలయ్యాక కోపం పోతుందా... వెయిట్ అండ్ సీ.