గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 16 నవంబరు 2014 (16:04 IST)

రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని వుంది: అమితాబ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. చెన్నైలో జరిగిన 'లింగా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అమీర్ మాట్లాడుతూ, రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించాడు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని ఈ 'మిస్టర్ పర్ఫెక్షనిస్టు' పేర్కొన్నాడు.
 
నిజానికి ప్రవేశం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది. రజనీ కూడా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతూ, ఇప్పటికే పలు పార్టీల విజ్ఞప్తులను సున్నితంగా తోసిపుచ్చారు. అయినప్పటికీ రజనీ సీఎం అయితే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని అమితాబ్ కూడా వ్యక్తం చేయడం గమనార్హం.