గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (19:31 IST)

రజనీకాంత్ ఫ్యాన్స్‌పై డాక్యుమెంటరీ.. ఫర్ ద లవ్ ఆఫ్ ఏ మ్యాన్ పేరిట..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ అభిమానులపై డాక్యుమెంటరీ రెడీ అయ్యింది. రజనీకాంత్‌పై ఆయన అభిమానులకు ఉన్న ప్రేమ, అభిమానం ఆమస్టర్ డామ్‌కు చెందిన రింకు కల్సీ యువ దర్శకుడికి స్ఫూర్తినిచ్చింది. ఆ అభిమానమే ఓ డాక్యుమెంటరీ రూపొందించాలనే ఆలోచన కలిగించింది. 
 
ఈ క్రమంలోనే 'ఫర్ ద లవ్ ఆఫ్ ఏ మ్యాన్' టైటిల్‌తో డాక్యుమెంటరీని రూపొందించాడు. రజనీ అనారోగ్యం సమయంలో అభిమానుల పడిన ఆవేదన, తమ అభిమాన నటుడి చిత్రం విడుదలకు ముందు అభిమానులు ఎంత ఉత్సాహంతో ఎదురుచూస్తారు వంటి పలు విషయాలను యువ దర్శకుడు ఈ డాక్యుమెంటరీలో చూపిస్తున్నాడు. 
 
"అభిమానుల్లో రజనీపై ఉన్న విపరీత ఆసక్తిని చూశాకే ఈ డాక్యుమెంటరీ ఆలోచన వచ్చింది. ఇందుకోసం నాలుగేళ్ల పాటు తమిళనాడులో ఆయన అభిమానులతో గడిపానని చెప్పుకొచ్చాడు. అలాగే త్వరలో రజనీని కలసి తాను తీసిన డాక్యుమెంటరీని చూపిస్తానని రింకు చెప్పాడు. ఇకపోతే... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తానని రింకు తెలిపాడు.