శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (14:20 IST)

ఇంటర్నెట్ లేకుండా నడిచే సూపర్ స్టార్ వెబ్‌సైట్...!

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఇంటర్నెట్ లేకుండానే నడిచే వెబ్ సైట్‌ను రూపొందించి మరో సారి తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఇంటర్నెట్ లేకుండా వెబ్‌సైటా...? వినడానికి నమ్మ శక్యంగా లేక పోయినా ఇది నిజం. అదే దీని ప్రత్యేకత.

మీరు ఈ సైట్‌లోకి ప్రవేశించగానే...ఓ ప్రకటన మీకు దర్శనం ఇస్తుంది. ''ఆయన సాధారణ వ్యక్తి కాదు..ఇది సాధారణ వెబ్ సైట్ కాదు, ఇది రజనీ శక్తితో నడుస్తుంది. సైట్ లోకి వెళ్లాలంటే మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించాలి'' అని సూచిస్తుంది. 
 
వెంటనే మీరు ఇంటర్నెట్ తొలగించక పోతే వెబ్‌సైట్ పని చేయదు. నెట్ తొలగించిన తర్వాతనే ఈ సైట్ లో ఎంటర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి కనెక్షన్ లేకుండానే రజనీకి సంబంధించిన వివరాలు అభిమానులకు తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఇంటర్నెట్ లేకుండా నడిచే వెబ్ సైట్ ఇదొక్కటే కావడం విశేషం. 
 
దీనిని ప్రముఖ వెబ్‌సైట్ క్రియేటివ్ డైరక్టర్ గురుబక్ష్ సింగ్ రూపొందించారు. నా అభిమాన హీరోకు కానుకగా ఇచ్చేందుకు ఈ సైట్ ను రూపొందించానని గురుబక్ష్ చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సైట్ చూసి ప్రపంచ వ్యప్తంగా ఉన్న రజనీ అభిమానులు సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.