శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (10:38 IST)

నటిగా ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు హద్దులు లేవు : రాఖీ సావంత్!

ఒక నటిగా అందాలను ఆరబోసేందుకు (ఎక్స్‌పోజింగ్) తనకు ఎలాంటి హద్దులు లేవని బాలీవుడ్ సెక్స్ బాండ్ రాఖీ సావంత్ చెపుతోంది. ఒక దశాబ్దం క్రితం రాఖీ సావంత్ 'మొహబ్బత్ హై మిర్చి' అనే చిత్రంలో ఐటం సాంగ్‌లో తన అందాలను ఆరబోసింది. తాజాగా ఈమె నటించిన 'ముంబై కాన్ డ్యాన్సా సాలా' అనే చిత్రంలో మరింతగా రెచ్చిపోయినట్టు సమాచారం.
 
ఈ చిత్రం గురించి రాఖీ సావంత్ స్పందిస్తూ.. చిత్రపరిశ్రమలో కొనసాగాలన్నా.. రాణించాలన్నా నా శరీర అందాలను చూపించక తప్పదు. గత రెండేళ్ళుగా తనకు ఎలాంటి ఆఫర్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కొనసాగడం చాలా కష్టం. పైగా నేను సినీ ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచిరాలేదు. అందువల్ల నాకెలాంటి సపోర్టు, గాడ్ ఫాదర్లు లేరన్నారు. 
 
ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నా కష్టం. శ్రమ. పైగా నన్ను నేను నియంత్రించుకోలేను. పైగా నాకంటూ హద్దులు లేవు. అందువల్ల నేను ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ముంబై కాన్ డ్యాన్స్ సాలా అనే చిత్రంలో మంచి అర్థవంతమైన పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు.